ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండడంతో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ రూపాల్లో సాయం అందిస్తుండడంతో పండ్ల రైతులు ఈ ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా 2023 -24 ఆర్థిక సంవత్సరంలో 11,20,77,190 టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ 1,81,11,600 టన్నుల పండ్లని ఉత్పత్తి చేసింది, ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 16.16 శాతంగా ఉంది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల […]