పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ చీఫ్ విప్ […]