బెంగుళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్ ఫీల్డ్ పరిధిలోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ లో ఈ ఏడాది మార్చ్ 1వ తారీఖున బాంబు పేలుడు సంభవించి సుమారు 10 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనకాల ఉగ్ర కుట్ర ఉందని పోలీసు దర్యాప్తులో తేలింది. కేసును చేధిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తాజాగా కేసు విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గానికి రావడం సంచలనంగా మారింది. […]