ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఆరు లోక్సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా విశాఖపట్నం నుంచి పులుసు సత్యనారాయణరెడ్డి, అనకాపల్లి నుంచి వేగి వెంకటేశ్, ఏలూరు నుంచి కావూరి లావణ్య, నరసరావుపేట నుంచి గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ […]