2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి మేనిఫెస్టోపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు, కానీ మూడు గంటల సమయం కావస్తున్నా వేదికపైకి ఎవరు రాకపోయేసరికి జర్నలిస్టులు విస్తుపోయారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రకటించారు. కానీ మూడు గంటలు అవుతున్నా […]