ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్రశిక్షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు వరకు 11వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 29,621 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ మొదటి […]