ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని అనకాపల్లి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.