వయవసాయం దండగ అనే రోజుల నుండి వ్యవసాయం పండగ అని నిరూపిస్తూ అన్నదాతలను అన్ని విధాలుగా చేయిపట్టుకు నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కట్టుబడుతూ దేశానికే ఆదర్శంగా రైతుకు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన జగనన్న ప్రభుత్వం తాజాగా నేడు వరుసగా ఐదో ఏడాది మూడో విడతగా రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు.
రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ.13,500 చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా– పీఎం కిసాన్ సాయం అందించడంలో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి అందించిన సాయం రూ.11,500. నేడు మూడోవిడతగా మరో రూ.2,000 చొప్పున మొత్తం 53.58 లక్షల మంది రైతన్నలకు రూ.1,078.36 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. దానితో పాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు.
రైతు భరోసా-పీఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతన్నకూ ఈ 57 నెలల్లో జగన్ ప్రభుత్వం అందించిన సాయం అక్షరాలా రూ. 34,288 కోట్లు. అలాగే వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలు ద్వారా 86.66 లక్షల రైతన్నలకు అందించిన వడ్డీ రాయితీ 2050.53 కోట్లు.. ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ తదితర పథకాల ద్వారా 57 నెలల్లో రైతన్నలకు జగన్ ప్రభుత్వం రూ.1,84,567 కోట్ల లబ్ధి చేకూర్చింది.
రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని క్రమం తప్పకుండా వైయస్సార్ రైతు భరోసా సాయాన్ని అందించామని ప్రభుత్వం అందించిన పెట్టుబడి సహాయం వారికి ఎంతో మేలు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్ రెడ్డి, ఉద్యానవనశాఖ సలహాదారు పి శివప్రసాద్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.